Sunday, 12 May 2013

Only a weak person needed someone else around all the time


బానిస బతుకులు పై పై మెరుగులు
పెనుగాలిలో మిడిసిపడే అజ్ఞానపు దీపాలు
జీవం లేని జీవితమెలా
ఆత్మ లేని శరీరమెలా
బంగారపు పూత కలిగిన ఇత్తడికి విలువుంటుందా
ఒకరి ఆలోచనలను అనుకరించిన నీ ప్రస్థానానికి ప్రయోజనముంటుందా
నీ పలుకులు నీ మది లో విరిసిన పుష్పలైతే
నీ అడుగులు నీ ఎద లో వికసించిన వ్యూహాలైతే
ఎన్నటికీ అస్తమించని సూర్యుడికి రూపం నీవే

Friday, 29 March 2013

Universal Truth - విశ్వవ్యాప్తమైన సత్యం



చిరునగవులు చిందించే పెదవులకీ తెలియనీవు
ఎదలో ఎగిసిపడే గాయాలా జ్ఞాపకాలనీ
కరుణ కురిపించే కనులకీ కనపడనీయవు
మదిలోన మెదిలే కన్నీటి కధలనీ
ఏన్నాళిలా ఈ జీవం లేని జీవితం
నీ ఉనికే ప్రశ్నార్ధకం ఐన నిమిషం
నీ మనుగడే నిష్ప్రయోజనం