బానిస బతుకులు పై పై మెరుగులు
పెనుగాలిలో మిడిసిపడే అజ్ఞానపు దీపాలు
జీవం లేని జీవితమెలా
ఆత్మ లేని శరీరమెలా
బంగారపు పూత కలిగిన ఇత్తడికి విలువుంటుందా
ఒకరి ఆలోచనలను అనుకరించిన నీ ప్రస్థానానికి ప్రయోజనముంటుందా
నీ పలుకులు నీ మది లో విరిసిన పుష్పలైతే
నీ అడుగులు నీ ఎద లో వికసించిన వ్యూహాలైతే
ఎన్నటికీ అస్తమించని సూర్యుడికి రూపం నీవే
No comments:
Post a Comment