ఏ క్షణాన ఉదయించిందో గానీ నా ఎద లో ీనీ స్నేహం
నాలో మొదలాయె నిన్నలేని సంతోషం
చీకటి నిండిన మౌనంలో మునిగిన నా ప్రాణం
వెన్నెల్లో వాలిందా నీ వల్ల ఈ నిమిషం
ఎన్నెన్నో చిరునవ్వుల చిలిపిదనం కలగలిసిన నీ సావాసం
కురిపించెను నా మది ముంగిట్లో మిన్నంటిన మమకారం
అనురాగపు అల్లర్లలో మరపురాని జ్ఞాపకాలెన్నో పరిచయం
చేసిన నీ స్నేహాం నా ఎద సవ్వడి ఆగిన కలకాలం నిలిచే ఓ వరం
No comments:
Post a Comment