Sunday, 16 September 2012

Love

కలకాలం నిలిచే ప్రేమను పరిచయం చేసిన నీ స్నేహం
ఒక జ్ఞాపకంలా మిగిలిందన్న వాస్తవం ఎరుగక నా హృదయం
 ప్రభాత వేళ క్రొత్త వెలుగులు నిండిన కాంతిని కోరే
 కోరిక నీ ఎడబాటు లో ఎగిసిన చీకటి ని పరిచయం చేసే.
చీకట్లు చేసిన చిత్రవధ లో క్షణక్షణం నీ జ్ఞాపకాలు గుర్తురాగా
కదిలిన కాలన్ని వెనుకకి తీసుకరావాలనే కంక్షా కలిగే నాలో
నా మనస్సు తెలుసుకున్న కాలం కలవరపడి వడివడిగా అడుగులేసే
 అడుగులలో ఎన్నో పరిచయాలు ,కలలు కలయికలు చేరిన
నిరంతరం నీ ఊహాలు చేలరేగే నా మదిలో  పెను ఉప్పెనలాఅయినా
ఎనాటికైనా కలల ప్రపంచం లో ఆశల సంద్రం లో
నీ ప్రేమ తీరాన్ని చేరతాననే ఊసులే నా ఊపిరి
నీ హృదయాలయం లో హారతులు వెలిగించాలన్న ఆశే నా శ్వాస
సూర్యుడు వెలుగులు పంచకపోయినాచంద్రుడు వెన్నెల
కురిపించకపోయినా కలకాలం నీకై ఎదురుచూసే ప్రేమ పిపాసి ని నేను.

No comments:

Post a Comment