Saturday, 6 October 2012

Just for u :)


ఏ క్షణాన ఉదయించిందో గానీ నా ఎద లో ీనీ స్నేహం
నాలో మొదలాయె నిన్నలేని సంతోషం
చీకటి నిండిన మౌనంలో మునిగిన నా ప్రాణం
వెన్నెల్లో వాలిందా నీ వల్ల ఈ నిమిషం
ఎన్నెన్నో చిరునవ్వుల చిలిపిదనం కలగలిసిన నీ సావాసం
కురిపించెను నా మది ముంగిట్లో మిన్నంటిన మమకారం
అనురాగపు అల్లర్లలో మరపురాని జ్ఞాపకాలెన్నో పరిచయం
చేసిన నీ స్నేహాం నా ఎద సవ్వడి ఆగిన కలకాలం నిలిచే ఓ వరం

Sunday, 16 September 2012

Love

కలకాలం నిలిచే ప్రేమను పరిచయం చేసిన నీ స్నేహం
ఒక జ్ఞాపకంలా మిగిలిందన్న వాస్తవం ఎరుగక నా హృదయం
 ప్రభాత వేళ క్రొత్త వెలుగులు నిండిన కాంతిని కోరే
 కోరిక నీ ఎడబాటు లో ఎగిసిన చీకటి ని పరిచయం చేసే.
చీకట్లు చేసిన చిత్రవధ లో క్షణక్షణం నీ జ్ఞాపకాలు గుర్తురాగా
కదిలిన కాలన్ని వెనుకకి తీసుకరావాలనే కంక్షా కలిగే నాలో
నా మనస్సు తెలుసుకున్న కాలం కలవరపడి వడివడిగా అడుగులేసే
 అడుగులలో ఎన్నో పరిచయాలు ,కలలు కలయికలు చేరిన
నిరంతరం నీ ఊహాలు చేలరేగే నా మదిలో  పెను ఉప్పెనలాఅయినా
ఎనాటికైనా కలల ప్రపంచం లో ఆశల సంద్రం లో
నీ ప్రేమ తీరాన్ని చేరతాననే ఊసులే నా ఊపిరి
నీ హృదయాలయం లో హారతులు వెలిగించాలన్న ఆశే నా శ్వాస
సూర్యుడు వెలుగులు పంచకపోయినాచంద్రుడు వెన్నెల
కురిపించకపోయినా కలకాలం నీకై ఎదురుచూసే ప్రేమ పిపాసి ని నేను.

Sunday, 9 September 2012

Sneham


మది లో వెన్నెల కురిపించే నీ సుశాంత స్వభావం
నాలో కలిగించింది స్నేహాం మీద నిజమైన నమ్మకం
మిరుమిట్లు గోలిపే నీ మిథున మనోహార మానవత్వం
నా మనస్సుకు పరిచయం చేసే కృష్ణతత్వపు ప్రియమాధుర్యం
నీ సహావాసం నను చే్రిన మరుక్షణం
వినోదాల విందుతో  వెలుగుతున్న  నా జీవనం
కలనైన ఎరుగదు నీ స్నేహనికి అంతం. 

Saturday, 8 September 2012


భరించలేని భాద దరి చేరిన
ఉప్ఫోంగే సంతోషం హద్దులు దాటిన
కనికరం లేని కాలం మదిలో చీకటి నింపిన  
దారి తప్పి వరించిన విజయం కళ్ళల్లో వెన్నెల వర్షించిన
ఒంటరి తనం అనుక్షణం నిలదీసిన
చెరగని చిరునవ్వే నా ప్రతిస్పందన 
ఓటమి అంగీకరించని స్వభావమే నాకు ప్రేరణ