కలకాలం నిలిచే ప్రేమను పరిచయం చేసిన నీ స్నేహం
ఒక జ్ఞాపకంలా మిగిలిందన్న వాస్తవం ఎరుగక నా హృదయం
ఓ ప్రభాత వేళ క్రొత్త వెలుగులు నిండిన కాంతిని కోరే
ఆ కోరిక నీ ఎడబాటు లో ఎగిసిన చీకటి ని పరిచయం చేసే.
ఆ చీకట్లు చేసిన చిత్రవధ లో క్షణక్షణం నీ జ్ఞాపకాలు గుర్తురాగా
కదిలిన కాలన్ని వెనుకకి తీసుకరావాలనే కంక్షా కలిగే నాలో
నా మనస్సు తెలుసుకున్న కాలం కలవరపడి వడివడిగా అడుగులేసే
అ అడుగులలో ఎన్నో పరిచయాలు ,కలలు కలయికలు చేరిన
నిరంతరం నీ ఊహాలు చేలరేగే నా మదిలో ఓ పెను ఉప్పెనలా, అయినా
ఎనాటికైనా కలల ప్రపంచం లో ఆశల సంద్రం లో
నీ ప్రేమ తీరాన్ని చేరతాననే ఊసులే నా ఊపిరి
నీ హృదయాలయం లో హారతులు వెలిగించాలన్న ఆశే నా శ్వాస
సూర్యుడు వెలుగులు పంచకపోయినా, చంద్రుడు వెన్నెల
కురిపించకపోయినా కలకాలం నీకై ఎదురుచూసే ప్రేమ పిపాసి ని నేను.